Vivek Oberoi: అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఎంతగానో కష్టపడుతున్న ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పొచ్చు. ఇయర్ కి రెండు సినిమాలు రిలీజ్ చేస్తా అని చెప్పి దానికోసం 100% కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయన హను రాఘవపూడితో ‘ఫౌజీ’ అలాగే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ ఇలా రెండు సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తాజాగా ప్రభాస్ పైన ప్రశంసలు కురిపించారు.
ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రభాస్ మాత్రం పట్టుదలతో తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు, ఆ విధానం నాకు ఎంతగానో నచ్చుతుంది. ప్రభాస్ ఎప్పుడూ గర్వం చూపించడు అలాగే తన స్టార్ డంని ఎవరిపైన చూపించకుండా అందరితో కలిసిపోతారు. అలాగే సెట్ లో తాను ఉన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ని తీసుకొని వస్తారు, దీంతో సెట్ లో అందరూ ప్రశాంతంగా పాజిటివ్ గా ఉంటారు. తాను సెట్స్ లోకి తీసుకొచ్చే ఫుడ్ గురించి మాటల్లో చెప్పలేం అని, అలాగే ఆయన ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నారు.
అభిమానులకి ఇచ్చిన మాటకోసం ఎండలను సైతం లెక్కచేయకుండా రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫౌజీ ఇంకా స్పిరిట్ సినిమా షూటింగ్ ఒకేసారి జరగడంతో కొన్ని రోజులు ఒకదగ్గర, ఇంకొన్ని రోజులు ఇంకో సినిమా సెట్లలో గడుపుతున్నారు ప్రభాస్. రెండు సినిమాలలో క్యారెక్టర్స్ వేరువేరు కావడంతో లుక్స్ పైన ఎంతగానో శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ రెండిటిలో ఏ ఒక్కటి పూర్తయినా కల్కి-2 షూటింగ్ లో జాయిన్ కావాలని చూస్తున్నారు.
