Varun Sandesh

Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభం

Varun Sandesh: వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత భరద్వాజ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా జెమిని సురేష్ గారి తల్లి ఎం వెంకట సుబ్బ లక్ష్మి గారు మొదటి షాట్ దర్శకత్వం చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు రక్షిత్ అట్లూరి, నటి శ్రీలు తదితరులు హాజరై తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మా సినిమాకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. మంచి ప్రాజెక్ట్ ను నమ్మి నా చేతిలో పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది మీడియా వారే, ఈ సినిమాకు మీ ప్రమోషన్ మంచి ఫలితం ఇస్తుంది” అన్నారు.

నటుడు వరుణ్ సందేశ్ మాట్లాడుతూ… “మా సినిమా బ్లాక్ మెయిల్ చిత్ర ప్రారంభానికి వచ్చిన అందరికీ థాంక్స్. నాకు దర్శకులు చాలా కాలంగా పరిచయం. ఆయన ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్ తో సినిమా వస్తుంది అని అర్థం అయింది. నిర్మాతలకు, అతిథులకు నా థాంక్స్. త్వరలో చిత్ర షూటింగ్ మొదలవబోతుంది” అన్నారు.

నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ… “బ్లాక్ మెయిల్ చిత్రంతో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నారు. ముఖ్యంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిర్మాతగానే కాకుండా ప్రతి మార్గంలో ఆయన అండగా నిలిచారు. నేను హీరోగా తొలి చిత్రం దర్శకత్వం చేసిన శ్రీనివాస్ గారు ఈ చిత్రంలో మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా అనిపించింది. అలాగే నాతో కలిసి నటిస్తున్న ప్రతి నటీనటులకు, అతిథులకు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. నాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వరుణ్ సందేశ్ గారికి ప్రత్యేకంగా థాంక్స్. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది. మా సినిమాకు నా మీడియా సోదరులు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు మల్లిక్ తేజ మాట్లాడుతూ… “నన్ను బ్లాక్ మెయిల్ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నందుకు దర్శక నిర్మాతలకు, నటీనటులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ… “దర్శకుడు అడిగితే ఎంత రిస్క్ అయినా చేసే వ్యక్తి వరుణ్ సందేశ్. సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి జెమిని సురేష్. వారితో కలిసి నటించడం సంతోషకరం. ఈ సినిమాలో పని చేయడం నా సొంత కుటుంబంలోని వ్యక్తులతో పని చేసినట్లు ఉంటుంది, ఎందుకంటే అందరూ నా వాళ్ళే. బ్లాక్ మెయిల్ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. నిర్మాత అవినాష్ మనుషుల పట్ల ఎంతో ఆప్యాయతగా మెలిగే వ్యక్తి, ఆతిథ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో మంచి పాత్రలు, పాత్రధారులు ఉండబోతున్నారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ… “నాకు బ్లాక్ మెయిల్ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న అవినాష్ గారికి ఆల్ ద బెస్ట్. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. వరుణ్ సందేశ్ గారికి ఈ సినిమా మరో మంచి విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తోటి నటీనటులతో కలిసి నటించడం సంతోషకరం. సినిమా మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఏసిపి విద్యా సాగర్ గారు మాట్లాడుతూ… “మీడియా వారికి నమస్కారం. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై రానున్న బ్లాక్ మెయిల్ చిత్రం మంచి విజయం సాధించాలని, వరుణ్ సందేశ్ గారికి మరొక హ్యాపీ డేస్ లా, అలాగే జెమిని సురేష్ గారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందం వారికి మంచి పేరు రావాలని, నిర్మాత అవినాష్ గారికి కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత అవినాష్ మాట్లాడుతూ… “మా బ్లాక్ మెయిల్ చిత్ర ప్రారంభానికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి చాలా థాంక్స్. నేను ఈ సినిమా రంగంలోకి రావడానికి ఒక ముఖ్య కారణం 200 కుటుంబాలకు పని కలిగించవచ్చు అని. ఇంకొకటి తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను. నా సినిమాకు వచ్చే లాభాలలో 10% మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఇస్తాను అని మీడియా సమక్షంలో నటిస్తున్నాను” అంటూ ముగించారు.

తారాగణం : వరుణ్ సందేశ్, జెమినీ సురేష్, పృథ్వీ రాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు.

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి
నిర్మాత: అవినాష్ కూనపరెడ్డి
బ్యానర్: హనుమాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సినిమాటోగ్రఫీ: జీఎస్ చక్రవర్తి రెడ్డి
సంగీత దర్శకుడు : SV మల్లిక్ తేజ
ఎడిటర్: రాఘవేంద్ర రెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
స్టిల్స్ : బి శ్రీకాంత్ రెడ్డి
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్
మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *