Rajinikanth

Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!

Rajinikanth: రజినీకాంత్ పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానమిచ్చేందుకు ఈరోజు ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సోషల్ మీడియాలో తనపైన నెగటివ్‌గా ప్రచారం జరుగుతుందని, దానిపైన ఇప్పుడు స్పందించడం ముఖ్యం అని తెలిపారు.

విజయ్ పైన నాకు ఎలాంటి పగ లేదు. ఆయనను సీఎం కానివ్వకుండా చేయాలని నేను ఏమీ చేయలేదు. అలాంటి నీచమైన పనులు నేను చేయనని తెలిపారు. స్టాలిన్‌ను నేను కలిసింది ఆ విషయంపైన కాదని, స్టాలిన్ నాకు మంచి మిత్రుడు కావడంతో ఎలక్షన్లలో ఓడిపోయిన ఆయనను పరామర్శించేందుకు మాత్రమే వెళ్లానని తెలిపారు.

విజయ్‌కు, నాకు మధ్య 25 ఏళ్ల తేడా ఉంది. ఆయన నాకు సమవుజ్జీ కాదని తెలుపుతూనే.. విజయ్‌కి బదులుగా కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడేవాడినని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాకు రాజకీయాలతో సంబంధం లేదు.. ఒకవేళ నేను 2021లో పార్టీ పెట్టుంటే తప్పకుండా గెలిచేవాడినని అన్నారు.

అసలు ఈ నెగటివిటీ ఎందుకు వచ్చిందంటే.. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత విజయ్ పార్టీ టీవీకే గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి 11 సీట్లు కావాల్సి ఉంది. ఈ సమయంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిస్తూ, కొంత సమయం తర్వాత మద్దతు ఇవ్వడం లేదు అంటూ మళ్లీ చెప్పడం.. ఈ సమయంలో తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో స్టాలిన్ ఇంటికి రజినీకాంత్ వెళ్లడం, అలాగే ఎయిర్‌పోర్ట్ వద్ద రజినీకాంత్‌ను “విజయ్ ఎలక్షన్లలో గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది?” అనే ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో సోషల్ మీడియాలో రజినీకాంత్ పైన నెగటివ్ ప్రచారం జోరందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *