Jana Nayagan

Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!

Jana Nayagan: వాయిదాలపైనా వాయిదాలు పడుతూ వస్తున్న ‘జన నాయగన్’ సినిమాపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించి సీఎం అయిన విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటి నుండి తనపై ఎన్ని విమర్శలు వచ్చాయో.. తన లాస్ట్ సినిమాను రిలీజ్ కానివ్వకుండా చేశారు.

కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత తన సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే నిర్మాతలతో చర్చలు జరిపారు. విజయ్ సీఎం అయినప్పటి నుండి ఫ్యాన్స్ టైటిల్ కార్డ్‌లో ‘సీఎం విజయ్’ అని వేయాలంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అలాగే ‘సీఎం’ అనే ట్యాగ్ ఫిక్స్ అని కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ విజయ్ మాత్రం సీఎంకు బదులు ‘దళపతి విజయ్’ అనే వేయాలని నిర్మాతలను కోరారు. జూన్‌లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘జన నాయగన్’ ఎప్పుడు విడుదలైనా సినిమాకు బెస్ట్ కలెక్షన్స్ ఇద్దామని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *