Sugar Export Ban

Sugar Export Ban: చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు.. 2026 సెప్టెంబర్ వరకు అమల్లోకి!

Sugar Export Ban: చక్కెర ధరలు సామాన్యులకు భారం కాకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా నిల్వలను పెంచడం ఇంకా ఆహార ద్రవ్యోల్బణాన్ని(inflation) అదుపు చేయడమే లక్ష్యంగా చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) బుధవారం రాత్రి విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, ముడి చక్కెర, తెల్ల చక్కెర ఇంకా శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై తక్షణమే నిషేధం అమలులోకి వస్తుంది. ఈ ఆంక్షలు 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగుతాయి.

నిషేధానికి గల కారణాలు

 దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకుండా అదుపు చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటు తెలుస్తుంది. గత ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన రాష్ట్రాల్లో చెరకు ఉత్పత్తి తగ్గడం. ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

మినహాయింపులు ఎవరికి?

ప్రభుత్వ నిర్ణయం వల్ల వ్యాపారులు ఇబ్బంది పడకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇచ్చింది.

నోటిఫికేషన్ రాకముందే ఓడల్లో లోడ్ చేసిన సరుకులకు ఇంకా భారత ఓడరేవుల్లో లంగరు వేసి ఉన్న నౌకలకు సంబంధించిన స్టాక్. షిప్పింగ్ బిల్లులు నమోదై, కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న నిల్వలకు. యూరోపియన్ యూనియన్ (EU) ఇంకా అమెరికా (USA)కు పంపే నిర్ణీత కోటా ఎగుమతులకు ఈ నిషేధం వర్తించకున్నా మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అంతర్జాతీయ మార్కెట్‌లో కలకలం

ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన భారత్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

  • ధరల పెరుగుదల: న్యూయార్క్‌లో ముడి చక్కెర ధరలు 2%, లండన్‌లో తెల్ల చక్కెర ధరలు 3% వరకు ఎగబాకాయి.

  • పోటీ దేశాలకు లాభం: భారత్ ఎగుమతులు ఆపడంతో ఆసియా, ఆఫ్రికా దేశాలు ఇప్పుడు బ్రెజిల్, థాయ్‌లాండ్ వైపు చూస్తున్నాయి, ఇది ఆ దేశాల ఆర్థిక వ్యవస్థకు కలిసివచ్చే అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *