Manchu Manoj: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బాధితురాలికి న్యాయం జరగాలని గట్టిగా కోరారు. సమాజంలో ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారని ఆయన తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.
ముఖ్యంగా పదవి, అధికారం లేదా హోదా అనేవి ఏ పరిస్థితిలోనూ న్యాయానికి అడ్డుకాకూడదని మనోజ్ పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. మన దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి బాలికకు సమాన న్యాయం దక్కాలని, చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై సినీ పరిశ్రమ నుంచి స్పందించిన మొదటి వ్యక్తిగా మంచు మనోజ్ నిలిచారు. సాధారణంగా ఇలాంటి రాజకీయపరమైన అంశాలపై సినీ ప్రముఖులు మౌనంగా ఉంటారు, కానీ మనోజ్ ధైర్యంగా ముందుకు వచ్చి స్పందించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యులకు అర్థమయ్యేలా, సూటిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position,…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 11, 2026
