Tamil Nadu Elections

Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్న మహిళా ఓటర్లు..?

Tamil Nadu Elections: దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం నేడు (ఏప్రిల్ 23, గురువారం) క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తన పట్టును నిలుపుకోవాలని చూస్తుండగా, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఇంకా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలు మార్పు కోసం గట్టిగా పోరాడుతున్నాయి.

అంకెలలో తమిళనాడు ఎన్నికలు:

ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య మరియు ఓటర్ల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉంది. మొత్తం అభ్యర్థులు 4,023 మంది ఉండగా  అందులో 3,585 మంది పురుషులు, 438 మంది మహిళలు అభ్యర్థులు ఉన్నారు.తమిళనాడులో

మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో విశేషం ఏంటంటే, పురుష ఓటర్లు 2,80,30,658 మంది ఉంటె మహిళా ఓటర్లు 2,93,04,905, ఉన్నారు అంటే సుమారు 13లక్షల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు వీరితోపాటు ట్రాన్స్‌జెండర్లు 7,728 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ లెక్కలను చూస్తుంటే తమిళనాడు రాజకీయాలని మార్చాలన్నా, సీఎం కుర్చీలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఉండాలో తేల్చేది మహిళలే. అందుకే ప్రతి పార్టీ ప్రచారంలో మహిళలను ఆకర్షించడానికే ఎక్కువ ప్రయత్నించాయి. వారికే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చాయి మేనిఫెస్టోలో. మే 4న తేలిపోనుంది ఎవరు గెలిచారో అన్నది.

ప్రధాని మోదీ పిలుపు – సెలబ్రిటీల సందడి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా తమిళ ఓటర్లకు పిలుపునిచ్చారు. “ముఖ్యంగా యువత మరియు నా సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి” అని ఆయన ఆకాంక్షించారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో సూపర్ స్టార్ రజనీకాంత్, నీలాంగరైలో నటుడు విజయ్, అల్వార్‌పేటలో కమల్ హాసన్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రానుండటంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.

ప్రధాన అంశాలు మరియు భద్రత:

  • కీలక నియోజకవర్గాలు: ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు, విజయ్ అరంగేట్రం చేస్తున్న పెరంబూర్, ఈపీఎస్ పోటీ చేస్తున్న ఎడప్పాడి స్థానాలపై అందరి దృష్టి నెలకొంది.

  • భద్రతా ఏర్పాట్లు: 1.5 లక్షల మందికి పైగా పోలీసు సిబ్బంది మరియు కేంద్ర బలగాలను భద్రత కోసం మోహరించారు. సుమారు 68,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • నగదు సీజ్: ఈ ఎన్నికల సమయంలో తమిళనాడులో రికార్డు స్థాయిలో రూ. 500 కోట్లకు పైగా నగదు మరియు బహుమతులను ఎన్నికల సంఘం సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

నేడు తీర్పు – మే 4న ఫలితాలు

మే 7తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో, నేడు ఓటర్లు ఇచ్చే తీర్పు మే 4న వెలువడే ఫలితాల్లో వెల్లడి కానుంది. ద్రవిడ రాజకీయాల మధ్య కొత్తగా వచ్చిన ‘దళపతి’ విజయ్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో అన్నది ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *