Crime News: ఏందిరా బాబు ఇది! తనకి సమయం ఇవ్వడం లేదని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేసిన యువతి. ఈ దారుణ ఘటన బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజనానగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కిరణ్(27) అనే వ్యక్తి ఓ మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అక్కడే ప్రేరణ అనే యువతితో ఏడాది నుండి ప్రేమలో ఉన్నారు. కొంత కాలంగా ఆమెకి సమయం ఇవ్వడం లేదని, దీంతో ఆమె తనని దూరం పెడుతున్నాడేమో అని, ఎక్కడ పెళ్లి చేసుకోడో అనే అనుమానంతో ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా హతమార్చాలని అనుకుంది.
మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేరణ, కిరణ్‌ని ఇంటికి పిలిచింది. అక్కడ కొంత సేపు మాట్లాడుకున్నారు. తర్వాత కిరణ్‌ని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కళ్ళు తాడుతో కట్టేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటే.. నీకు డిఫరెంట్ గా ప్రొపోజ్ చెయ్యడానికి ఇలా చేస్తున్నానని చెప్పడంతో, నమ్మిన కిరణ్ ఏం మాట్లాడకుండా ఉన్నాడు. కళ్ళకు గంతలు కట్టి కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో కిరణ్ సజీవదహనం అయిపోయారు. ఈ విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెని ఘటన గురించి అడగడంతో.. నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఇలా జరిగిందని చెప్పింది. ఆమెపైన అనుమానం రావడంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి విచారించగా, పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటిదంటే ఈ మొత్తాన్ని ఆమె ఫోన్ లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
అనుమానం ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ, ఇలా హత్య చేస్తారా అని స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
