BCCI New Rules

BCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!

BCCI New Rules: భారత అండర్-19 జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయుష్ మహాత్రే ఇంకా వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 (సీజన్ 19)లో అదరగొడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆయుష్, రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకటించిన భారత అండర్-25 జట్టులో వీరిద్దరికీ చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏమిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) టోర్నమెంట్?

ఐపీఎల్ 19వ సీజన్ ముగిసిన వెంటనే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (మునుపటి ఎన్‌సీఏ) వేదికగా ఒక కీలకమైన టోర్నమెంట్ జరగనుంది. భవిష్యత్ స్టార్లను వెలికితీసేందుకు బీసీసీఐ ఈ వేదికను వాడుకుంటోంది.

ఈ టోర్నమెంట్ లో మొత్తం 64 మంది అత్యుత్తమ యువ ఆటగాళ్లు పాల్గొంటారు.వీరు 4 జట్లుగా విడిపోయి, 4 రోజుల పాటు జరిగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో తలపడతారు. ఈ ప్రదర్శన ఆధారంగానే సీఓఈ చీఫ్ భవిష్యత్ భారత జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.

ఆ 64 మందిని ఎలా ఎంపిక చేస్తారు?

బీసీసీఐ ఎంపిక ప్రక్రియ ఇలా ఉండబోతోంది:

  1. సీకే నాయుడు & అండర్-23 వన్డే జట్టు: 25 మంది ఆటగాళ్లు.

  2. దేశీయ క్రికెట్ (రంజీ, విజయ్ హజారే, ముస్తాక్ అలీ): 25 మంది ఆటగాళ్లు.

  3. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా: 14 మంది ఆటగాళ్లు.

ఆయుష్, వైభవ్‌లకు ఇంకా అవకాశం ఉందా?

ప్రస్తుతం ప్రకటించిన అండర్-25 జట్టులో వీరి పేర్లు లేకపోయినా, వీరు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి.. ఐపీఎల్ కోటాలో ఎంపిక చేసే 14 మంది ఆటగాళ్ల జాబితాలో ఆయుష్ ఇంకా వైభవ్‌లకు చోటు దక్కే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, వీరికి తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు, ఐపీఎల్ ముగిశాక తుది జాబితాలో వీరి పేర్లు వచ్చే అవకాశం ఉంది.

ప్రకటించిన అండర్-25 టీమ్ ఇండియా (ప్రధాన ఆటగాళ్లు):

ఆయుష్ దోసెజా, యశ్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేశ్ పిథియా, రాజ్ లింభానీ, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, అకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజా, భువనగిరి పున్నయ్య, ఈడెన్ తోమయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *