C. M. Ramesh: లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ సి.ఎం. రమేష్ పాల్గొని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ సహకారంతో రూపుదిద్దుకున్న ఈ బిల్లుతో అమరావతిని ఇకపై ఎవరూ అంగుళం కూడా కదిలించలేరని, ఇది ప్రతి తెలుగువాడి గుండె చప్పుడని ఆయన పేర్కొన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పేరుతో ‘మూడు ముక్కలాట’ ఆడుతూ అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని, ప్రజావేదిక కూల్చివేతతో తన అరాచక పాలనను మొదలుపెట్టారని విమర్శించారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు మరియు మహిళలపై గత ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై నమ్మకంతో రైతులు త్యాగం చేసిన ఈ ప్రజా రాజధాని చరిత్రలో నిలిచిపోతుందని, ఇకపై పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రాజధాని విషయంలో నాటకాలు ఆడలేరని సి.ఎం. రమేష్ స్పష్టం చేశారు.
