IPL 2026

IPL 2026: సీఎస్‌కే అభిమానులకు షాక్.. తొలి రెండు వారాలు ధోనీ దూరం!

IPL 2026: ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు సీఎస్‌కే అభిమానులకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నందున టోర్నమెంట్ తొలి రెండు వారాలు అందుబాటులో ఉండడని సీఎస్‌కే సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

ప్రస్తుతం ధోనీ పిక్క కండరాల గాయం నుండి కోలుకునేందుకు రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని పోస్ట్‌లో చెప్పారు. అందులో టోర్నమెంట్ మొదలైన రెండు వారాలు అందుబాటులో ఉండరని ఉంది. అంటే ఈరోజు నుండి ఏప్రిల్ 10 వరకు జరిగే మ్యాచ్‌లలో ధోనీని చూసే అవకాశం లేనట్టే. మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్‌కే మొదటి మ్యాచ్ ఆడనుంది. దీనితో పాటు పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మ్యాచ్‌లలో కూడా ధోనీ అందుబాటులో ఉండరు. అభిమానులు ‘తల’ ఆటను చూసేది ఏప్రిల్ 11న డీసీతో జరిగే మ్యాచ్‌లోనే. అప్పుడు కూడా బ్యాటింగ్ చేస్తారో లేదో తెలియదు.

ఈ ఏడాది 45 ఏళ్లు పూర్తిచేసుకున్నారు ధోనీ. తనతో పాటు టీమ్‌లో సంజు శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్.. మొత్తం నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు. ధోనీ త్వరగా కోలుకొని మైదానంలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఐదుసార్లు కప్పు గెలుచుకుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా 226 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి, అందులో 133 విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్ ధోనీ మాత్రమే.

IPL 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *