Hyderabad: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలు కీలక శాఖల కార్యదర్శులతో పాటు, పలు జిల్లాల కలెక్టర్లకు కూడా స్థానచలనం కలిగింది. ప్రధానంగా ఫైనాన్స్, ఇరిగేషన్, పరిశ్రమల శాఖల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది.
తాజాగా బదిలీల ప్రకారం..
-
సంజయ్ కుమార్ ఇండస్ట్రీస్ నుంచి PR&RD శాఖకు బదిలీ
-
ఎన్. శ్రీధర్ IT&C ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
-
సబ్యసాచీ ఘోష్‌కు ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & CSR బాధ్యతలు
-
ఎం. దానా కిషోర్‌కు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) అదనపు బాధ్యతలు
-
రాహుల్ బొజ్జా పొలిటికల్ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
-
డా. గౌరవ్ ఉప్పల్ ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖకు బదిలీ
-
TGMSIDC మేనేజింగ్ డైరెక్టర్‌గా డా. గౌరవ్ ఉప్పల్‌కు అదనపు బాధ్యత
-
బి. విజయేంద్ర మహబూబ్‌నగర్ కలెక్టర్ బదిలీ
-
ఆద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ (న్యూ ఢిల్లీ)కి పోస్టింగ్
-
యాదాద్రి కలెక్టర్ హనుమంతరావుకు ఎండౌమెంట్స్ డైరెక్టర్ బాధ్యతలు
-
సిక్తా పట్నాయక్ ఫైనాన్స్ శాఖకు స్పెషల్ సెక్రటరీగా నియామకం
-
పామెలా సత్పతి లేబర్ శాఖకు స్పెషల్ కమిషనర్‌గా బదిలీ
-
అనురాగ్ జయంతి యాదాద్రి కలెక్టర్‌గా నియామకం
-
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సహకార శాఖకు స్పెషల్ కమిషనర్
-
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి
-
హనుమకొండ కలెక్టర్‌గా బదిలీ
-
హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి.
- ప్రస్తుత కలెక్టర్ హనుమంతరావు గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ.
