Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆధ్యాత్మికత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్ షెడ్యూల్స్ మధ్య కాస్త విరామం దొరికినా ఆయన నిష్టతో అయ్యప్ప మాల ధరించి కనిపిస్తుంటారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా విజయం సాధిస్తే పార్టీలు, సెలబ్రేషన్లలో మునిగిపోతారు. కానీ, చరణ్ మాత్రం ఆ విజయ గర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా, ప్రశాంతంగా మాల వేసుకొని భక్తి మార్గంలో ఉంటారు. తాజాగా ఆయన అయ్యప్ప మాలలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అభిమానుల నుండి ఒక ఆసక్తికరమైన డిమాండ్ తెరపైకి వచ్చింది.
అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ ముఖ వర్చస్సు, ఆయన కళ్ళలో ఉండే తీక్షణత మరియు ఆ ‘రాజసం’ చూస్తుంటే.. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ చేస్తే అద్భుతంగా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
శివాజీ మహారాజ్ ఎలాగైతే దైవ భక్తి కలిగిన వీరుడో, చరణ్ కూడా నిత్యం ఆధ్యాత్మిక చింతనతో ఉండటం ఈ పాత్రకు ఒక ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సరైన డైరెక్టర్, బలమైన స్క్రిప్ట్ కుదిరితే ఛత్రపతి శివాజీగా రామ్ చరణ్ మినహా మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దర్శకుడు ఎవరు? రాజమౌళినా లేక లక్ష్మణ్ ఉటేకర్ నా?
ఈ భారీ పీరియడ్ డ్రామాను ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరైనా ఒక్కరు తీస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు.
-
రాజమౌళి: ఛత్రపతి శివాజీగా సినిమాని ఒక్కవేల రాజమౌళి తిస్తె వల అమ్మకి ఛత్రపతి శివాజీగా కి ఉండే అనుబంధానికి సంబందించిన సన్నివేశాలు ఎవరు చూపించని విధిగా చూపిస్తారు. ఇంకా ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చడంలో రాజమౌళి దిట్ట. చరణ్‌తో ఆయనకు ఉన్న బాండింగ్ దృష్ట్యా ఈ కాంబో సెట్స్ పైకి వస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం.
-
లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar): రాజమౌళి తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే ఇతని పేరే చెబుతారు. ఆయన దర్శకత్వం వహించిన ‘చావా’ (Chhaava) సినిమా 2025 ఫిబ్రవరి 14న విడుదలై సంచలనం సృష్టించింది. దాదాపు 800 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా తర్వాత, మరాఠా చరిత్రను తెరపైకి తెచ్చే నైపుణ్యం ఉటేకర్ కి ఉందని నిరూపితమైంది.
