Viral News

Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..

Viral News: సోషల్ మీడియాలో చిన్న లేదు పెద్ద లేదు.. ప్రతి ఒక్కరూ ఫేమస్ కావడానికి చేయని పనులు, పడని తిప్పలు లేవు. దాని కోసం కొన్నిసార్లు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే, మరికొంత మంది తమ చుట్టూ ఉన్న వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో పిల్లలతో తల్లి చేసిన విన్యాసాలు చూసిన నెటిజన్లు ఒక్కటే మాటంటున్నారు. పిల్లలకి రక్షణగా ఉండాల్సిన తల్లే వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆ వీడియోలో ఒక బావి అంచున నిల్చున్న తల్లి, తన ఇద్దరు పిల్లలను రెండు చేతులతో పట్టుకుని వారిని బావి మధ్యలో వేలాడదీస్తూ డ్యాన్స్ చేస్తోంది.

పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా తనకే తగిలినట్టు బాధపడేది తల్లి.. కానీ ఈ రోజుల్లో అలా లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొంతమంది తమ పిల్లలతో డ్యాన్స్‌లు లేదా చిన్న చిన్న కామెడీ బైట్స్ చేయిస్తున్నారు. కానీ మరికొంత మంది పైన వీడియోలో చూపించినట్టు పిల్లల ప్రాణాలతో రిస్క్ చేస్తూ ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు.

చిన్నతనంలోనే పిల్లలకి మొబైల్, సోషల్ మీడియా అలవాటు చేయడం ఇప్పుడు బాగానే ఉండొచ్చు. “మా అబ్బాయి లేదా అమ్మాయి అస్సలు అల్లరి చేయకుండా మొబైల్‌లో వీడియోలు చూస్తూ కూర్చుంటున్నారు” అని పక్కింటి వారికి చెప్పేటప్పుడు గర్వంగా అనిపించవచ్చు. కానీ, పిల్లలు బయటకెళ్లి ఆడుకుంటేనే వారి ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *