Gun Fire: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. పొద్దుపొద్దునే తుపాకీ శబ్దాలతో ఉలిక్కిపడిన కోఠి.. డబ్బులు డిపాజిట్ చేయడానికి కోఠి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌కి ఈరోజు పొద్దునే వెళ్లిన వ్యక్తిపై కాల్పులు జరిపి, అతని దగ్గర నుండి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు..
అందిన సమాచారం ప్రకారం.. రషీద్ అనే వ్యక్తి ఈరోజు (శనివారం) ఉదయం 7 గంటల ప్రాంతంలో తన దగ్గర ఉన్న 6 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కోఠి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌కి చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: KCR: రేపు విచారణకు రావాలి.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు
అతడిని గమనిస్తూ ఫాలో చేస్తూ వచ్చిన దుండగుడు, సమయం చూసుకొని అతనిపైన కాల్పులు జరిపి రూ. 6 లక్షల డబ్బుని ఎత్తుకెళ్లాడు. ఈ సమయంలో రషీద్ కాలుకి బుల్లెట్ తగిలింది.
కాల్పుల సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గాయాలైన రషీద్‌ను చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
