TG EAPCET

TG EAPCET: టీజీ ఈఏపీసెట్‌-2026 షెడ్యూల్‌ విడుదల

TG EAPCET: తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET-2026 మరియు పీజీ కోర్సుల కోసం నిర్వహించే TG PGECET-2026 పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేశారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు.

TG EAPCET-2026 పూర్తి వివరాలు..

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్ (EAPCET) నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయి. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4 వరకు గడువు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Lucknow: కోతి అని పిలిచినా భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు మే 4, 5 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు మే 9 నుంచి మే 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

TG PGECET-2026 షెడ్యూల్..

ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ వంటి పీజీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి నిర్వహించే పిజిసెట్ (PGECET) నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న వెలువడుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 6 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలు మే 28 నుంచి మే 31 వరకు జరుగుతాయి.

విద్యార్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *