Border 2: సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేస్తోంది. రిపబ్లిక్ డే వీకెండ్‌లో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్కును అవలీలగా దాటిన ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో విజయోత్సాహంలో ఉన్న మేకర్స్ ‘బోర్డర్ 3’ను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Pawan Kalyan: రూ.40 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన పవన్ కళ్యాణ్!
‘బోర్డర్ 2’ దేశభక్తి చిత్రంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటించిన ఈ సినిమా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే భారీ వసూళ్లు సాధించి రూ.170 కోట్లకు పైగా గ్రాస్ చేసింది. రిపబ్లిక్ డే రోజు రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే ఇండియాలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విజయంతో ఈ సినిమా నిర్మాతలు.. టీ-సిరీస్ భూషణ్ కుమార్, జేపీ ఫిల్మ్స్ నిధి దత్తా ‘బోర్డర్ 3’ను అనౌన్స్ చేశారు. త్వరలో నటీనటులు, సాంకేతిక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 1997లో వచ్చిన ఒరిజినల్ బోర్డర్ సీక్వెల్‌గా ఈ చిత్రం భారీ హిట్ అయింది. ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపుతోంది.
