Harish Rao: సింగరేణి టెండర్ల విషయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన వివరణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భట్టి మాటలు “మసిపూసి మారేడుకాయ” చేసినట్లు ఉన్నాయని, అసలు విషయాన్ని పక్కన పెట్టి సాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
హరీష్ రావు ప్రధానంగా నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. “మీరు చెబుతున్నట్లుగా అసలు కుంభకోణమే జరగకపోతే, నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేశారంటేనే అక్కడ తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అర్థమని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువుల పాత్ర ఉందని, వారి కోసమే నిబంధనలు మార్చారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలి
భట్టి విక్రమార్క ‘సైట్ విజిట్’ నిబంధనను సమర్థించుకోవడాన్ని కూడా హరీష్ రావు తప్పుబట్టారు. ఈ నిబంధనను గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు మారిపోవని హితవు పలికారు. అలాగే, తాము బయటపెట్టిన సోలార్ పవర్ స్కామ్ గురించి భట్టి తన ప్రెస్ మీట్‌లో ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. నైనీ టెండర్లను రద్దు చేసినట్లే, మిగతా అన్ని వివాదాస్పద టెండర్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతోనే సాధ్యమవుతుందని, అందుకే తాను కేంద్రానికి లేఖ రాశానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ భట్టి విక్రమార్క గారు నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇస్తే, ఆయనకు కూడా లేఖ రాయడానికి సిద్ధమని తెలిపారు. సింగరేణిని కాపాడటమే తమ ఉద్దేశమని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
భట్టి గారూ..
బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేసారు.
మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది నిజం.నేను సూటిగా…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 24, 2026
