Mobile: ఈ ఫోన్ కొంటే రెండు రోజులు చార్జింగ్ అవసరం లేదు.. 10000mah..!

Mobile: భారత మార్కెట్లో భారీ బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Realme P4 Power 5G’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో పరిశ్రమలోనే తొలిసారిగా 10,001mAh భారీ బ్యాటరీ ఉండటం విశేషం. బ్యాటరీ సమస్యతో తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన వినియోగదారుల ఇబ్బందులను తొలగించడమే ఈ ఫోన్ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ సన్నగా, తేలికగా ఉండటం ప్రధాన ప్రత్యేకత. సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీ వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ శక్తి నిల్వ చేయడం సాధ్యమైంది. ఈ ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు, మందం 9.08mm మాత్రమే ఉండటంతో ఈ కేటగిరీలో ప్రపంచంలోనే సన్నని, తేలికైన భారీ బ్యాటరీ ఫోన్‌గా నిలవనుంది.

భద్రత, మన్నిక పరంగా కూడా ఈ ఫోన్‌కు పెద్దపీట వేసారు. ఐదు లేయర్ల బ్యాటరీ సేఫ్టీ ఆర్కిటెక్చర్‌తో రూపొందించి TÜV రైన్‌ల్యాండ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. మిలిటరీ-గ్రేడ్ షాక్ టెస్ట్‌లను కూడా పాసైందని, మైనస్ 30 డిగ్రీల చలి నుంచి 56 డిగ్రీల వేడి వరకు స్థిరంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

బ్యాటరీ హెల్త్ తగ్గిపోవడం సమస్యకు కూడా పరిష్కారం చూపించారు. ‘టైటాన్ లాంగ్-లైఫ్ అల్గారిథమ్’ ద్వారా నాలుగేళ్ల తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80%కి పైగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొత్తం ఎనిమిదేళ్ల బ్యాటరీ హెల్త్ ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్ రూపొందించబడింది.

ఈ ఫోన్ జనవరి 29న విడుదల కానుంది. realme.com మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. పవర్ బ్యాంక్‌లు, ఛార్జింగ్ పాయింట్ల గురించి ఆలోచించకుండా ఎక్కువ రోజులు ఫోన్ ఉపయోగించాలనుకునే వారికి ఇది గేమ్-చేంజర్‌గా మారవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *