Singareni:

Singareni: సింగ‌రేణి విష‌యంలో కేంద్రం ఓ కీల‌క నిర్ణ‌యం

Singareni: సింగ‌రేణి టెండ‌ర్లపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుండ‌గా, కేంద్ర ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నైని బొగ్గు బ్లాకుల టెండ‌ర్ల విష‌యంలో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు సంస్థ‌కు సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న‌ను త‌న అనుయాయుల కోస‌మే రాష్ట్రంలోని కాంగ్రెస్ పెద్ద‌లు తీసుకొచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆ నైని బ్లాక్‌ల టెండ‌ర్ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఈ ద‌శ‌లోనే కేంద్రం తీసుకున్న ఓ నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసింది.

Singareni: సింగ‌రేణి మైనింగ్ టెండ‌ర్ల దందాల‌పై విచార‌ణ జ‌రుపాల‌ని చెప్తూనే రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం షాకిచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవ‌ల మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్ కోస‌మ‌ని సింగ‌రేణి సీఎస్సార్ నిధుల‌ను దుర్వినియోగం చేశార‌న్న ఆరోప‌ణ‌లపై విచార‌ణ చేయాల‌ని కేంద్రం ఆదేశించింది. ఇటీవ‌ల ప్ర‌ముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు.

Singareni: మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్‌తో సొంత ప‌బ్లిసిటీ చేసుక‌న్నాడ‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాని నిర్వ‌హ‌ణ‌ కోసం రూ.10 కోట్ల‌ను సింగ‌రేణి నిధుల‌ను వాడార‌ని ఆరోప‌ణ‌లు. అంతేకాకుండా మ‌రికొన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల పేరుతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల కోసం సింగ‌రేణి సీఎస్సార్ నిధుల్లో దుర్వినియోగం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. వీటిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి, మూడు రోజుల్లోగా నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని సింగ‌రేణి సంస్థ ఉన్న‌తాధికారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *