Honey Teaser

Honey Teaser: వణికిస్తున్న హనీ టీజర్.. నవీన్ చంద్ర సైకలాజికల్ హారర్ థ్రిల్లర్!

Honey Teaser:  నవీన్ చంద్ర హీరోగా వస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’ టీజర్ తాజాగా విడుదలైంది. దివ్య పిళ్లై ప్రధాన పాత్రలో నటించారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్షుద్రపూజలు, చేతబడులు కాన్సెప్ట్‌తో రూపొందింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. టీజర్ చూస్తుంటే భయం కలిగిస్తోంది.

Also Read: Director Atlee: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న అట్లీ-ప్రియ

నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *