High Way Toll Changes: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న వాహనాల టోల్ విధానంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన అంశాలను వెల్లడించింది. దీనిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించింది. ఆ రోజు నుంచి ముఖ్యంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్లలో నగదు చెల్లింపులను పూర్తిగా బంద్ చేయాలని నిర్ణయించింది. ఇకపై టోల్ చార్జీలు పూర్తిగా డిజిటల్ విధానంలోనే జరగాలని ఆదేశాలు జారీచేసింది.
High Way Toll Changes: టోల్ గేట్ల వద్ద వాహనదారులు అధిక సమయం నిలిచి ఉండటంతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో వాహనదారులు, టోల్ సిబ్బంది నడుమ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నగదు చెల్లింపుల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నది. డిజిటల్ విధానంతో వాహనాల రాకపోకలు వేగవంతంగా సాగడమే కాకుండా, ప్రయాణం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నది.
High Way Toll Changes: ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకొచ్చే నిబంధనల ప్రకారం.. ఫాస్టాగ్, లేదా ఫోన్ పే, గూగుల్, తదితర డిజిటల్ పేమెంట్ యాప్‌లనే వినియోగించాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులకు ఆస్కారమే ఉండదన్నమాట. డిజిటల్ పేమెంట్లు వాడని వారికి ఇక నుంచి చుక్కలు చూపిస్తారన్నమాట. ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉన్నదని కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.
High Way Toll Changes: ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ ఖాతాలను రీచార్జి చేసుకొని, డిజిటల్ చెల్లింపులకు సిద్ధపడాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. డిజిటల్ ఇండియా లక్ష్యాల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నూతన విధానంతో పారదర్శకత పెరగడంతోపాటు టోల్ వసూళ్లలో అవకతవకలకు అడ్డు పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
