Delhi: ప్రముఖ పారిశ్రామికవేత్త టాప్ 10 ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి గట్టి షాక్ తగిలింది. 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారనే ఆరోపణపై ఆదాని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు 8 మంది పై కేసు నమోదైంది. అమెరికాలోని న్యూయార్క్ కోర్టు వారెంట్ జారీ చేసింది.
కేసు ఎందుకు నమోదు అయిందంటే..
ప్రధాని గ్రూప్ చేపట్టిన భారీ సోలార్ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఆఫీసర్లకు లంచాలు ఇచ్చారని ఆరోపణ ఎదుర్కొంది. 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు అదానీ మేనల్లుడు సాగర్ తో సహా 8 మందిపై కేసు నమోదు చేసింది.
కాగా మరికొద్ది సేపట్లో స్టాక్ మార్కెట్లో ఓపెన్ కావడంతో ఇన్వెస్టర్లకు భారీ టెన్షన్ నెలకొంది. అదానీపై కేసు నమోదు కావడంతో స్టాక్ మార్కెట్ పై ఎంత ప్రభావం చూపుతుందని బయర్లు గగ్గోలు పెడుతున్నారు. మరి ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి. దీనిపై బిజినెస్ విశ్లేషకులు స్పందిస్తూ స్టాక్ మార్కెట్ పై భారీ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.