Nara Lokesh

Nara Lokesh: రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష

Nara Lokesh: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 20 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు వారితో కలిసి ఆయన ముచ్చటించారు. తెలుగు వారు సముద్రాలు దాటి ఎక్కడికి వెళ్లినా మన సంప్రదాయాలను, సంస్కృతిని మర్చిపోకుండా కొనసాగించడం గర్వకారణమని ఆయన కొనియాడారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని లోకేష్ గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు విజన్.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సుమారు రూ. 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లోకేష్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని 16 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ఇంజినీరింగ్ కాలేజీలు తీసుకురావడం వల్లే నేడు తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారని చెప్పారు. ఏపీని ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Renu Desai: ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేస్తారా?

పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్.. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’

ఏపీలో వ్యాపారాలు చేసే వారికి అండగా ఉండేందుకు తమ ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తోందని లోకేష్ వివరించారు. స్విట్జర్లాండ్‌లోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కంపెనీలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) సహకారంతో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.

రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని లోకేష్ విమర్శించారు. ఏపీలో 11 మంది సభ్యులతో కూడిన ఒక ‘ఏడుపుగొట్టు టీమ్’ ఉందని, వారు పెట్టుబడులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కష్టకాలంలో ఎవరికైనా చంద్రబాబు నాయకత్వమే గుర్తుకు వస్తుందని, ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ‘బ్రాండ్ సీబీఎన్’ పై నమ్మకంతో పెట్టుబడిదారులు రావాలని కోరారు. యువ నాయకత్వం ఒక మిస్సైల్ లాంటిదైతే, వారికి చంద్రబాబు ఒక జీపీఎస్ (GPS) లాగా మార్గనిర్దేశం చేస్తున్నారని లోకేష్ అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *