Korean Kanakaraju: మెగా ఫ్యామిలీలో కొత్త రకమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్రబృందం. వరుణ్ తేజ్ హీరోగా, వినోదాత్మక చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా టైటిల్ మరియు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు.
కొరియన్ భాషలో వరుణ్ డైలాగ్
ఈ సినిమా టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వరుణ్ తేజ్ కొరియన్ భాషలో “నేను తిరిగొచ్చేశా” (I am back) అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో ‘కనకరాజు’ అనే వెరైటీ పాత్రలో కనిపించబోతున్నారు. కామెడీ మరియు హారర్ అంశాల కలయికతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Nacharam: ఒక మద్యం గ్లాసు కోసం.. అన్నను హత్య చేసిన తమ్ముడు!
వేసవి బరిలో కనకరాజు
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేసిన వరుణ్ తేజ్, ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో కూడిన కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమాపైనే
గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్‌కు ఈ ‘కొరియన్ కనకరాజు’ ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అవుతుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. టైటిల్ విభిన్నంగా ఉండటం, మేర్లపాక గాంధీ మార్కు వినోదం తోడవ్వడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Fun on one side 😎
Thrill on the other 😈Meet @IAmVarunTej in a never-before seen avatar as #KoreanKanakaraju ❤️🔥#KOKAGlimpse OUT NOW 💥
— https://t.co/qZ6CHqpDsq#KOKA In theatres this SUMMER 2026. #HBDVarunTej@GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy… pic.twitter.com/Z8nHKaXpS4— UV Creations (@UV_Creations) January 19, 2026
