Visakhapatnam

Visakhapatnam: విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు!

Visakhapatnam: విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ అక్కడ ఒక ప్రత్యేకమైన ‘బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్’ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. మారికవలస సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఅవుట్‌లో ఈ కార్యాలయ నిర్మాణం కోసం ఇప్పటికే స్థలాన్ని సేకరించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విదేశీ రాకపోకలు మరింత పెరుగుతాయని, అందుకే ఈ పూర్తిస్థాయి కార్యాలయం అవసరమని కేంద్రం భావిస్తోంది.

ఈ కొత్త భవనంలో ‘ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్’ (OCR) కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఇది విదేశీయుల పత్రాలను సాంకేతికంగా విశ్లేషించి, సమాచారాన్ని భద్రపరిచే ఒక హైటెక్ చెక్‌పోస్టులా పనిచేస్తుంది. ప్రస్తుతం సిబ్బంది కొరతతో రాష్ట్ర పోలీసుల సాయం తీసుకుంటున్న తరుణంలో, ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే ఇమ్మిగ్రేషన్ తనిఖీలు మరింత వేగంగా, పకడ్బందీగా సాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *