Russia-America: రష్యా, అమెరికా దేశాల్లోమంచు బీభత్సం సృష్టిస్తున్నది. ఇండ్లు, రోడ్లు అన్న తేడా లేకుండా మంచుతో కప్పబడి పోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా జనజీవనం స్తంభించిపోతున్నది. నిత్యం పనులు, ఇతర విధులకు వెళ్లాల్సిన వారు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తున్నది. శని, ఆదివారాల్లో (జనవరి 17,18 తేదీల్లో) విపరీతమైన మంచు కురిసి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.
Russia-America: రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంతో రికార్డు స్థాయిలో మంచు బీభత్సం సృష్టిస్తున్నది. 146 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ భారీ హిమపాతంతో వీధులన్నీ నిండిపోయాయి. సుమారు 3 మీటర్ల మేర మంచుతో నిండిపోవడం గమనార్హం. రోడ్లు, ఇండ్ల వద్ద ఉంచిన వాహనాలన్నీ మంచులో కూరుకుపోయాయి. మంచును తవ్వి తొలగించి ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలు కొనసాగించాల్సి వస్తున్నది.
Russia-America: విపరీతమైన మంచు కురుస్తుండటంతో రష్యాలోని కంచట్కా ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అక్కడి విద్యాసంస్థలు మూతబడ్డాయి. పెద్ద భవంతులు, అపార్ట్‌మెంట్లపై కూడా మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Russia-America: అమెరికా దేశంలోని పలు ప్రాంతాల్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. ముఖ్యంగా మిడ్ వెస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో హిమపాతం కురుస్తున్నది. రోడ్లపై వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ప్రజలు తమ దైనందిన పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ మంచు తుఫాన్ ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
