KTR:రంగారెడ్డి జిల్లా లగచర్ల గ్రామంలో ఇటీవల జరిగిన భూపోరాట బాధితురాలు జ్యోతి కూతురు భూమినాయక్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగాయి. లగచర్ల భూపోరాట సమయంలో నిండు గర్భిణి అయిన జ్యోతి అదే సమయంలో కూతురుకు జన్మనిచ్చింది.
KTR:జ్యోతి దంపతులు తమ బిడ్డను తీసుకొచ్చి పేరు పెట్టాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు. లగచర్ల ప్రజలు భూమికోసం పోరాడుతున్న సమయంలో పుట్టినందున ఆ చిన్నారికి కేటీఆర్ భూమినాయక్ అనే నామకరణం చేశారు. ఇప్పుడు ఆ చిన్నారి భూమినాయక్‌కు ఏడాది వయసొచ్చింది. మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని జ్యోతి దంపతులు చిన్నారిని వెంట తీసుకొచ్చారు. తెలంగాణ భవన్‌లో ఇతర ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కేటీఆర్ కేక్ కట్ చేసి, ఆ చిన్నారికి తినిపించి, ముద్దు చేశారు.
