Gold Price Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక చేదు వార్త. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు మళ్లీ పైకి కదులుతున్నాయి. ఒకరోజు ధర తగ్గితే, మరుసటి రోజు అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా నేడు బుధవారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,42,540 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,660 వద్ద ఉంది. ఇక తక్కువ బడ్జెట్‌లో ఉండే 18 క్యారెట్ల బంగారం ధర కూడా లక్ష దాటి రూ. 1,06,910 వద్ద పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం స్వల్పంగా తగ్గిన ధరలు, ఇప్పుడు మళ్లీ పెరుగుతూ దాదాపు రూ. 1.50 లక్షల మార్కుకు చేరువలో ఉండటం గమనార్హం.
వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ. 2,75,100 ఉండగా, మన హైదరాబాద్‌లో మాత్రం ధర మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ఏకంగా రూ. 2,92,100 వద్ద కొనసాగుతోంది. అంటే వెండి ధర త్వరలోనే రూ. 3 లక్షల మార్కును దాటేలా కనిపిస్తోంది. శుభకార్యాల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల సామాన్యుల జేబుకు చిల్లు పెడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,42,540గా ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే చెన్నైలో ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అక్కడ తులం బంగారం రూ. 1,43,690 వద్ద ఉంది. ఢిల్లీలో రూ. 1,42,690 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల కారణంగా ఈ ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను సరిచూసుకోవడం మంచిది.
