The Raja Saab

Rajasaab: ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన రాజాసాబ్ మూవీ HD ప్రింట్..

Rajasaab: డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజాసాబ్ విడుదలైన వెంటనే అనూహ్యమైన దెబ్బను ఎదురుకుంది. ప్రేక్షకులు థియేటర్లకు వెల్లివెళ్లి సినిమా చూసేందుకు ఉత్సాహంగా ఉన్న సమయంలోనే, ఈ సినిమాలోని HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం కలకలాన్ని రేకెత్తించింది.

పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో లింకులు వేగంగా పాకిపోవడంతో సినీ మేకర్లలో ఆందోళన చెలరేగింది. విడుదల తొలి రోజు నుంచే ఇలా లీక్ అవడం నిర్మాతలకు తీవ్ర ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక వివాదం నడుస్తోంది. టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వ మెమోను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లకు ముందుగా ఊహించిన కలెక్షన్లు రాకపోవచ్చని భావిస్తున్న సమయంలో పైరసీ రూపంలో మరో ఇబ్బంది రావడం సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది.

ఈ పరిణామాలు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ లింకులను గుర్తించిన వెంటనే సైబర్ క్రైమ్ శాఖకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ, సంబంధిత సైట్లను బ్లాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా అవసరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం, అయితే మూలం వెతకడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ సమస్య కొత్తది కాదు. ప్రతీ పెద్ద సినిమా విడుదల సమయంలో ఇదే ఇబ్బంది రావడం నిర్మాతలను, పంపిణీదారులను, థియేటర్ యజమానులను కంగారు పెడుతోంది. భారీ పెట్టుబడులతో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాలు విడుదల రోజే లీక్ కావడం వలన సినిమా బిజినెస్‌కు గట్టి దెబ్బ తగులుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అభిమానులు మాత్రం ఒక్క మాట చెబుతున్నారు—సినిమాను థియేటర్‌లో చూసి టీమ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. “పైరసీకి నో చెప్పండి, డార్లింగ్‌కు సపోర్ట్ ఇవ్వండి” అంటూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *