Makthal: మ‌క్త‌ల్‌లో దారుణం.. మున్సిప‌ల్ సిబ్బంది నిర్వాకంతో చిరువ్యాపారి మృతి

Makthal: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో బుధ‌వారం దారుణం చేసుకున్న‌ది. అక్క‌డి మున్సిప‌ల్ అధికారుల నిర్వాకం, అత్యుత్సాహంతో ఓ చిరువ్యాపారి త‌నువు చాలించాల్సి వ‌చ్చింది. బతుకు బండి న‌డ‌వ‌నిదే.. రోజు గ‌డ‌వ‌ని ఆ కుటుంబానికి ఆధారం కోల్పోయింది. పాల‌న‌లో మాన‌వీయ‌త కోల్పోతే ఇలాగే ఉంటుంద‌ని మాన‌వ‌తావాదులు మండిప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ప‌ట్ట‌ణంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. చిరువ్యాపారులు భగ్గుమంటున్నాయి.

Makthal: నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన‌ మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో గ‌త కొన్నేండ్లుగా బాల‌మ్మ అనే మ‌హిళ కూర‌గాయ‌లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న‌ది. ఆమె రోడ్డుపై కుళ్లిన కూర‌గాయలు వేస్తున్న‌ద‌ని మున్సిప‌ల్ సిబ్బంద గుర్తించారు. దాంతో ఆమెకు రూ.200 జ‌రిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చారు. ఆ సిబ్బంది అత్యుత్సాహంతో మ‌రో నిర్వాకానికి పాల్ప‌డ్డారు. మ‌రోసారి కుళ్లిన‌ కూర‌గాయ‌లు రోడ్డుపై వేస్తే రూ.10 వేలు జ‌రిమానా వేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Makthal: దీంతో ఆ చిరువ్యాపారి బాల‌మ్మ మ‌న‌స్తాపానికి గురైంది. కండ్లు చెమ‌ర్చాయి. బాధ గుండె లోతుల్లోకి చేరింది. ఒళ్లంతా చ‌ల్ల‌బ‌డింది. అదే క్ష‌ణాన‌ నేల‌పై వాలిపోయింది. ఈ ఘ‌ట‌న‌ను చూసిన స్థానికులు బాల‌మ్మ‌ను స‌మీపంలోని ప్ర‌భుత్వాస్ప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆమె కాన‌రాని లోకాల‌కు వెళ్లింద‌ని వైద్యులు సెల‌విచ్చారు. గుండెపోటు కార‌ణంగా ఆమె చ‌నిపోయింద‌ని చెప్పారు. చూశారా! రోడ్లపై పెద్ద వ్యాపారులు, బ‌డాబాబులు ఎంత చేసినా కిమ్మ‌నని సిబ్బంది అత్యుత్సాహానికి పోయి బెదిరింపుల‌కు దిగ‌డంతో ఓ చిరువ్యాపారి ప్రాణ‌మే పోయింది. ముంద‌స్తుగా రోడ్డుపై కుళ్లిన కూర‌గాయ‌లు వేయొద్ద‌ని చెప్పి ఉంటే ఆమె జాగ్ర‌త్త ప‌డి ఉండేది.. ఆమె ప్రాణం ఆ కుటుంబ స‌భ్యుల‌కు ద‌క్కేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *