Muncipal Elections:

Muncipal Elections: మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఆ రోజే వ‌చ్చేది..

Muncipal Elections: రాష్ట్రంలో ఇప్పుడు పుర పోరుపై చ‌ర్చ సాగుతున్న‌ది. ఎప్పుడెప్పుడా? అని ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర వాసులు ఎదురు చూస్తున్నారు. ఆ రోజుపై ఒక అప్‌డేట్ రానే వ‌చ్చింది. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ అందింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీల‌కు, ఆరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నికల ప్ర‌క్రియ‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

Muncipal Elections: రాష్ట్రంలోని ఆరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు 366 డివిజ‌న్ల‌కు, 117 మున్సిపాలిటీల ప‌రిధిలోని 2630 వార్డుల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. జ‌న‌వ‌రి 10లోగా ఓట‌ర్ల జాబితా పూర్తిచేయాల‌ని, 12వ తేదీన తుది జాబితాను ప్ర‌క‌టించాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీచేసింది. పోలింగ్ స్టేష‌న్ల వివ‌రాల‌తోపాటు ఆయా కేంద్రాల్లో ఫొటో గుర్తింపు పొందిన ఓట‌రు జాబితాల‌ను జ‌న‌వ‌రి 16న అధికారికంగా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. మ‌రుస‌టి రోజే షెడ్యూల్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

Muncipal Elections: ఈ మేర‌కు జ‌న‌వ‌రి 17న మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ షెడ్యూల్ విడ‌ద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ది. ఆ త‌ర్వాత నాలుగు రోజులకు అంటే జ‌న‌వ‌రి 21న లేదా 22వ తేదీన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందించిన విశ్వ‌స‌నీయ స‌మాచారం. మొత్తం అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే ఫిబ్ర‌వ‌రి మూడో వారంలోగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ముగిస్తార‌ని, కొత్త పాల‌క‌వ‌ర్గాలు కొలువుదీరుతాయ‌ని తెలుస్తున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *