TG Assembly

TG Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం

TG Assembly: మూడు రోజుల సెలవుల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సభలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం (MNREGA) పై ప్రభుత్వం కీలక చర్చ జరపనుంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 90 శాతం నుండి 60 శాతానికి తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాలపై పడుతున్న అదనపు భారాన్ని ఎత్తిచూపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.

Also Read:  Gali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!

శాసనపరమైన అంశాల్లో భాగంగా మున్సిపల్ శాఖ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లు  మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లులు కూడా నేడు సభ ముందుకు రానున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించి సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. అయితే, తొలిరోజు కేవలం సంతకం చేసి వెళ్ళిపోయిన మాజీ సీఎం కేసీఆర్ నేటి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *