Roshan: ఛాంపియన్ సినిమాతో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్‌కు మరో భారీ ఆఫర్ దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ నటించబోతున్నాడు. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Spirit: స్పిరిట్ నుంచి న్యూ ఇయర్ సర్‌ప్రైజ్!
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఛాంపియన్ చిత్రంతో రోషన్ తన నటన, లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ విజయం నేపథ్యంలో రోషన్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. నిర్మాత నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. హిట్ 3తో విజయం సాధించిన దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రోషన్ కోసం శైలేష్ పూర్తి ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ రాసినట్టు నాగవంశీ తెలిపారు. హిట్ 3 యాక్షన్ మోడ్‌లో సాగగా ఈ కొత్త చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఛాంపియన్‌తో కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టిన రోషన్ ఈ ప్రాజెక్ట్‌తో మరింత ఎదగనున్నాడు. సితార బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రం రోషన్ కెరీర్‌కు మైలురాయిగా నిలవనుంది.
