Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు పబ్‌లలో ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టే దిశగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలో నగరంలోని ప్రముఖ క్వేక్ ఎరీనా పబ్‌లో ఈగల్ టీమ్ సోదాలు చేపట్టింది. పబ్‌లో ఉన్న కస్టమర్లు, సిబ్బందిపై డ్రగ్ టెస్టులు నిర్వహించగా మొత్తం 8 మందికి డ్రగ్ పాజిటివ్‌గా తేలింది.
డ్రగ్స్ వినియోగం, సరఫరాపై సమాచారం సేకరిస్తున్న పోలీసులు సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.నగరవ్యాప్తంగా పబ్‌లు, క్లబ్‌లు, ఈవెంట్లపై తనిఖీలు మరింత పెంచనున్నట్లు ఈగల్ టీమ్ వెల్లడించింది.
