Anaganaga Oka Raju: యువ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ‘రాజుగారి పెళ్లిరో’ విడుదలైంది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నవీన్, మీనాక్షి చౌదరి డాన్స్‌తో యువతను ఆకట్టుకుంటున్న ఈ పాట సినిమాపై అంచనాలు పెంచింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sara Arjun: తొలి సినిమాతోనే 1000 కోట్ల బ్లాక్‌బస్టర్.. సారా అర్జున్ రికార్డు
యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా టైటిల్ సాంగ్ ‘రాజుగారి పెళ్లిరో’ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నవీన్ పోలిశెట్టి ఉత్సాహంగా కనిపించగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి అందంతో అందరినీ ఆకర్షించారు. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన పెప్పీ బీట్స్‌కు అనుగుణంగా నవీన్, మీనాక్షి డాన్స్ మూమెంట్స్ యువతను అలరిస్తున్నాయి. చంద్రబోస్ రాసిన సాహిత్యాన్ని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ జోష్‌తో పాడారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం కలర్‌ఫుల్ వెడ్డింగ్ వైబ్స్‌తో సాగుతుంది.
