Prakash Raj: నీ పోరాటం కొనసాగించు డియర్..

Prakash Raj: హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా స్పందించడంతో విషయం మరింత వేడెక్కింది.

“మా శరీరం, మా ఇష్టం” అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు ఆమెకు మద్దతుదారులను తెచ్చిపెట్టగా, ట్రోలింగ్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అనసూయకు బహిరంగంగా మద్దతుగా నిలిచారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్,

> “సంస్కారులు అని చెప్పుకునే వాళ్లు మొరుగుతూనే ఉండనివ్వండి. అది వారి నీచమైన మనస్తత్వం. నువ్వు మాత్రం తల ఎత్తుకుని నిలబడు డియర్ అనసూయ. మేమంతా నీతోనే ఉన్నాం. నీ పోరాటం కొనసాగించు. నీకు మరింత శక్తి చేకూరాలి”అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, తనపై జరుగుతున్న విమర్శలకు మరోసారి స్పందించిన అనసూయ,

“ఏ పరిస్థితుల్లోనైనా నేను తలవంచను. నన్ను ఎవరూ భయపెట్టలేరు. సమాజంలో వినిపించని, పట్టించుకోని ఒక వర్గం గొంతుకను నేను వినిపిస్తున్నాను”అని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనసూయకు పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతుండగా, కొందరు శివాజీ వ్యాఖ్యలకు అనుకూలంగా నిలవడం గమనార్హం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *