Google Search Trends 2025

Google Search Trends 2025: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో అల్లు అర్జున్.. 2025లో టాలీవుడ్ హీరోల ఆధిపత్యం!

Google Search Trends 2025:  2025 సంవత్సరం ముగింపుకు చేరుకుంటుండగా, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ద్వారా టాలీవుడ్ హీరోల ఆన్‌లైన్ ప్రజాదరణ వెల్లడైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు. రెబల్ స్టార్ ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Hyderabad: హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు

2025 ఏడాది డిజిటల్ ప్రపంచంలో టాలీవుడ్‌ను శాసించిన హీరోల జాబితాను గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ వెల్లడించింది. తొలి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచి తన ప్రభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ‘పుష్ప-2: ది రూల్’ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, దాని చుట్టూ ఏర్పడిన హైప్ కారణంగా బన్నీ ఏడాది పొడవునా వార్తల్లో నిలిచారు. అట్లీతో ‘AA22’, త్రివిక్రమ్‌తో కొత్త ప్రాజెక్టులపై అంచనాలు కూడా నెటిజన్లను అల్లు అర్జున్ పేరు ఎక్కువగా సెర్చ్ చేయించాయి. రెండో స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ‘కల్కి 2’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాల అప్‌డేట్స్ ప్రభాస్‌ను నిరంతరం ట్రెండింగ్‌లో ఉంచాయి. మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నాలుగో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐదో స్థానంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. మొత్తంమీద 2025లో టాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్‌తోపాటు సెర్చ్ ఇంజిన్లలోనూ తమ హవాను చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *