Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరుస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Bunny Vasu: త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ జనవరి లో అనౌన్స్ మెంట్?
ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధిస్తోంది. వసూళ్లు వేయి కోట్ల మార్కును దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలన్న ఆశ నెరవేరడం కష్టమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రైట్స్ సొంతం చేసుకుని భారీ రిలీజ్ ప్లాన్ చేశారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలు వమ్మయ్యాయి. కారణం ముందే కుదుర్చుకున్న ఓటీటీ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ సమయంలో కొత్త భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి అవకాశం లేదు. ముఖ్యంగా తెలుగులో రిలీజ్‌కు ఆటంకం కలిగింది. దీంతో తెలుగు ప్రేక్షకులు నిరాశలో మునిగారు. అయితే రెండో భాగం ధురంధర్-2 మాత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 2026 మార్చి 19న ఈ సీక్వెల్ థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.
