Ghatkesar: కుటుంబ కలహాలు, మనస్పర్థలు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య నుంచి విడాకుల నోటీసులు అందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్‌లో చోటుచేసుకుంది.
ఆరేళ్ల బంధం.. ఆపై కలహాలు
పోలీసుల కథనం ప్రకారం.. ఎదులాబాద్‌కు చెందిన వెంకటేశ్ (40) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2019లో కీసరకు చెందిన మౌనిక (విజయలక్ష్మి)తో వివాహం జరిగింది. మౌనిక కీసరలోని ఒక గురుకుల పాఠశాలలో స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. వివాహమై ఆరేళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kunju Muhammed: మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం.. మాజీ ఎమ్మెల్యే, దర్శకుడు కుంజు మహమ్మద్ అరెస్ట్!
ఆత్మహత్యకు దారితీసిన కారణం
మనస్పర్థలు తీవ్రం కావడంతో మౌనిక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె కోర్టు ద్వారా భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. ప్రాణంగా ప్రేమించిన భార్య నుండి విడాకుల నోటీసులు రావడాన్ని వెంకటేశ్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే గొడవలతో సతమతమవుతున్న అతను, నోటీసు చూడగానే తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.
ఉరేసుకుని బలవన్మరణం
బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకున్న వెంకటేశ్, గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికే అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
