Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కారు గిఫ్ట్ వెనుక హార్ట్ టచింగ్ స్టోరీ!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మనసు ఎంత గొప్పదో చూపించారు. దర్శకుడు సుజీత్‌కు ఆయన లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వడం ఇటీవల సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే ఈ గిఫ్ట్ వెనుక ఉన్న కథ తెలిసిన తర్వాత అభిమానులు మరింత భావోద్వేగానికి గురవుతున్నారు.

‘ఓజీ’ సినిమా షూటింగ్ సమయంలో సుజీత్ సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. ముఖ్యంగా జపాన్‌లో జరిగే కీలక షెడ్యూల్ కోసం అదనపు బడ్జెట్ అవసరం ఏర్పడింది. ఆ సమయంలో నిర్మాతల నుంచి తగినంత నిధులు అందుబాటులో లేకపోవడంతో, సుజీత్ తన సొంతంగా ఖర్చులు భరించాల్సి వచ్చింది. సినిమాపై ఉన్న నమ్మకం, కమిట్‌మెంట్‌తో ఆయన తనకు ఎంతో ఇష్టమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మి, ఆ డబ్బును షూటింగ్‌కు వినియోగించినట్లు సమాచారం.

Also Read: Bhartha Mahashayulaku Vignapthi: సంక్రాంతికి ముందే ఫన్ ట్రీట్: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రిలీజ్

ఇదే కాకుండా, ‘ఓజీ’కి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఐడియాలు, కామిక్స్ కాన్సెప్ట్ వంటి వాటికీ సుజీత్ తన సొంత డబ్బునే ఖర్చు చేశాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాలన్నీ షూటింగ్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్‌కు తెలిసాయి. దర్శకుడి అంకితభావం చూసి ఆయన ఎంతో చలించిపోయారు. సుజీత్ చేసిన త్యాగానికి గుర్తుగా పవన్ కళ్యాణ్ అతడికి తిరిగి అదే తరహా కొత్త లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. మొదట ఈ విషయంపై కొందరు సోషల్ మీడియాలో కారుకు సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ల గురించి ట్రోల్స్ చేశారు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కారు కొనుగోలు మాత్రమే కాదు, నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను కూడా పవన్ కళ్యాణ్‌యే చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఘటన పవన్ కళ్యాణ్ స్టార్ హోదాకే కాదు, ఆయనలోని మానవత్వానికి మరో నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా కోసం తన సొంత ఆస్తిని కూడా త్యాగం చేసిన దర్శకుడిని గౌరవిస్తూ పవన్ చేసిన ఈ పని, సినీ పరిశ్రమలో అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *