Sangareddy:

Sangareddy: ప్రియుడితో ఇంటిలో ఉన్న యువ‌తి.. అక‌స్మాత్తుగా తండ్రి రావ‌డంతో..

Sangareddy: ఇదొక హ‌ఠాత్ప‌రిణామం.. ఈ వాఖ్యం జోక్ చేయ‌డానికి వాడింది కాదు. ఓ ప్రేమ జంట‌కు ఎదురైన ఉహించ‌ని సంఘ‌ట‌న‌ను వివ‌రించ‌డానికి చెప్పింది. ఈ ఘ‌ట‌న‌తో ఆ జంట‌లోని యువ‌తి మృత్యువు ఒడికి చేరుకోవాల్సి వ‌చ్చింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో పాత‌బ‌స్తీకి చెందిన యువ‌తి మ‌ర‌ణించింది. దీంతో ఆ కుటుంబంతోపాటు స్థానికంగా విషాదం అలుముకున్న‌ది.

Sangareddy: హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన ఓ మైనారిటీ వ్య‌క్తి కుటుంబానికి కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది. ఇంకా ఆ ఇంటిలోకి ఆ కుటుంబం చేర‌లేదు. దీంతో 8వ అంత‌స్తులో ఖాళీగా ఉంటున్న ఆ ఇంటికి ఆ కుటుంబ య‌జ‌మాని కూతురైన 20 ఏళ్ల వ‌య‌సున్న యువ‌తి తన ప్రియుడితో క‌లిసి వెళ్లింది. ఇంటి లోప‌లికి వెళ్లిన ఆ ఇద్ద‌రూ లోప‌లి వైపు త‌లుపున‌కు లాక్ చేసుకున్నారు.

Sangareddy: ఈ లోగా ఆ ప్రేమ జంట‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. వారు ఆ ఇంటి లోప‌ల ఉండ‌గా, ఆ యువ‌తి తండ్రి వ‌చ్చి త‌లుపు త‌ట్టాడు. ఒక్క‌సారిగా ఆ ఇద్ద‌రికీ ఒళ్లు జ‌ల‌ధ‌రించింది. త‌లుపు ద‌గ్గ‌రికి వెళ్లి ప‌రిశీలించ‌గా, త‌న తండ్రి గొంతు వినిపించింది. త‌న తండ్రేన‌ని గుర్తించిన ఆ యువ‌తి.. త‌న ప్రేమికుడితో తాను దొరికిపోతానేమోన‌ని భ‌యపడింది.

Sangareddy: ఎలాగైనా తండ్రి కంట‌ప‌డ‌కుండా పారిపోవాల‌ని ప్లాన్ వేశారు. త‌న ప్రియుడి స‌హ‌కారంతో బాల్క‌నీ నుంచి ప‌క్క ఫ్లాట్‌కు వెళ్లేందుకు య‌త్నించింది. దీంతో ఈ స‌మ‌యంలో ఆమె కాలుజారి కింద‌ ప‌డిపోయింది. 8వ అంత‌స్తు నుంచి ఆమె కింద ప‌డ‌టంతో ఆ యువ‌తి మ‌ర‌ణించింది. దీంతో ఆ యువ‌తీ, యువ‌కుల ప్రేమ విషాదాంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *