Local Body Elections: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన కీలక వ్యాఖ్యలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఊహాగానాలు అందుకున్నాయి. పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా విజయవతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించిన దానికంటే అధిక మొత్తంగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నది. అయితే ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు ఉత్కంఠకు దారితీసింది.
Local Body Elections: పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ పరిషత్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైనా దృష్టి పెట్టింది. పంచాయతీల తప్ప మిగతా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేస్తున్నదని, అన్నీ కుదిరితే 2026 జనవరి నెలలోనే ఈ ఎన్నికలు జరుగుతాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు మరో చర్చకు దారితీసింది.
Local Body Elections: పంచాయతీ మినహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై త్వరలోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్‌లో ఉన్నందున భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనేది ప్రతిపక్షాలతో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్నది.
Local Body Elections: తాము అనుకున్న దానికంటే కాంగ్రెస్‌కు కొంచెం తక్కువ, బీఆర్ఎస్కు కొంచెం ఎక్కువ సీట్లు వచ్చాయని కాంగ్రెస్ పెద్దల భావిస్తున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చాలా చోట్ల పుంజుకున్నదని తెలుస్తున్నది. ఈ దశలో వెంటనే ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ మరింతగా పుంజుకుంటుందేమోనన్న అనుమానం అధికార పార్టీకి కలిగిందని తెలుస్తున్నది. అందుకే కొంత ఆలస్యంగా పెట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Local Body Elections: ఈలోగా రైతు భరోసా, ఇతర ఆరు గ్యారెంటీలలో ఒకదానిని అమలు చేసి పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకే కొంత ఆలస్యం చేసే అవకాశం ఉన్నది. పంచాయతీ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ఇతర ఎన్నికలపై ఓ వ్యాఖ్య చేశారు. మిగతా స్థానిక ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్‌తోనే ముందుకెళ్తామని ప్రకటించారు. అందుకే ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
