Snapchat: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ తన యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌తో ఫోటోలు, వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు.
సాధారణంగా అందరూ తమ వీడియోలు, ఫోటోలను ప్రొఫెషనల్స్ తరహాలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలని ఆశపడతారు. కానీ, అందరికీ ఎడిటింగ్ నైపుణ్యం ఉండదు, అంత సమయం కూడా దొరకదు. అలాంటి వారి కోసమే స్నాప్‌చాట్ “క్విక్ కట్” (Quick Cut) అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఎడిటింగ్ గురించి కనీస అవగాహన లేని వారు కూడా తమ ఫోటోలను, వీడియోలను ఆటోమేటిక్‌గా ఎడిట్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: KTR: పార్టీ నిర్మాణంపై ఫోకస్.. ఫిరాయింపులపై వార్.. యాదాద్రి గడ్డపై కేటీఆర్ హాట్ కామెంట్స్!
ఇది ఎలా పనిచేస్తుందంటే: యూజర్స్ ముందుగా తమకు నచ్చిన సాంగ్ లేదా మ్యూజిక్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎడిట్ చేయాలనుకుంటున్న ఫోటోలు, వీడియోలను సెలెక్ట్ చేసుకుని ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఆ మ్యూజిక్ రిథమ్‌కు సెట్ అయ్యేలా ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఎడిట్ చేస్తుంది. ఒకవేళ యూజర్స్ స్వయంగా మార్పులు చేయాలనుకుంటే, ఇందులో ‘టైమ్ లైన్’ ఆప్షన్ కూడా ఉంది. దాని ద్వారా నచ్చిన ఫిల్టర్లు మార్చుకోవడం లేదా మ్యూజిక్ అడ్జస్ట్ చేసుకోవడం వంటివి చేయవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ iOS (iPhone) వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో కూడా తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.
Meet Quick Cut, a new way to turn your Memories into beat-synced videos in seconds, all within @Snapchat.
Faster creation, fewer steps, and more creative possibilities with Lenses and Sounds. Now on iOS, coming to more soon. Learn more: https://t.co/KQzjUMNgoU pic.twitter.com/mJN2xvglwo
— Snap Inc. (@Snap) December 17, 2025
