Medak

Medak: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ – బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

Medak: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం కోనాయిపల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పోలింగ్ కేంద్రం దగ్గర ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ వర్గాల కార్యకర్తల మధ్య మొదట వాగ్వాదం జరిగింది. ఈ చిన్నపాటి గొడవ కాస్తా పెద్దదై, చివరికి ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘర్షణ పడుతున్న వర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చి, గొడవ సద్దుమణిగింది. ఎన్నికల వేళ ఈ ఘర్షణతో కోనాయిపల్లెలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *