Singer Chinmayi

Singer Chinmayi: మార్ఫింగ్ ఫొటోలపై చిన్మయి ఫైర్!

Singer Chinmayi:  ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద రోజు రోజుకూ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతోంది. తాళి విషయంపై భర్త వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు మార్ఫింగ్ ఫొటోల వరకు వచ్చింది. డబ్బులు తీసుకుని వేధిస్తున్నారని చిన్మయి ఆరోపించింది. సింగర్ చిన్మయి శ్రీపాద గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులు ఎదుర్కొంటోంది. అవసరం లేని ప్రతి నెగటివ్ కామెంట్ కి రిప్లై ఇస్తూ ట్రోల్ అవుతుంది. భర్త రాహుల్ రవీంద్రన్ తాళి వేసుకోవడం తన ఇష్టమని చెప్పిన మాటలతో మొదలైన ట్రోలింగ్ ఇప్పుడు అసభ్య కామెంట్లు, మార్ఫింగ్ ఫొటోల వరకు వచ్చింది.

Also Read: Hrithik Roshan: ధురంధర్‌పై హృతిక్ వ్యాఖ్యలు వివాదం.. నెటిజన్ల ఫైర్!

తాజాగా ఓ మార్ఫ్డ్ బోల్డ్ ఫొటో వైరల్ కావడంతో చిన్మయి ఘాటుగా స్పందించింది. గత 8-10 వారాలుగా తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డబ్బులు తీసుకుని ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆ ఫొటోను పోలీసులకు ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. అమ్మాయిలు ఇలాంటి వేధింపులకు భయపడకూడదని, కుటుంబానికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఇప్పటికే ఫిర్యాదు అందింది. పిల్లలు చచ్చిపోవాలని కోరుకునే వారికి అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలా అని చిన్మయి ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *