Rangareddy

Rangareddy: 90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం

Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంది. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి తన ఇంట్లో పడుకుంది. అర్థరాత్రి 12 గంటల సమయం అయింది. అప్పుడే ఎవరో డోర్ కొట్టినట్లు అనిపించడంతో వెళ్లి తీసింది. వెంటనే బయటనుంచి 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఆ వృద్ధురాలిపై మృగంలా విరుచుకు పడ్డాడు.

ఆ సమయంలో వృద్ధురాలు ఏమీ చేయలేక గజగజలాడిపోయింది. ఆమె అరుపులు పెదవి దాటలేకపోయాయి. ప్రతిఘటించే సత్తువ కూడా ముసలవ్వలో లేకపోవడంతో ఆ యువకుడు అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆమె మాత్రం స్పృహతప్పి రాత్రంతా అక్కడే పడిపోయింది. ఉదయం వచ్చిన పనిమనిషి రక్తపుమడుగులో పడి ఉన్న ఆ వృద్ధురాలిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించడంతో అంతా అక్కడకు చేరుకున్నారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని హాస్పిటల్‌కు తరలించారు. ఇదంతా గంజాయి బ్యాచ్ పని కావచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో.. రేప్‌కు పాల్పడిన వ్యక్తికి మరో ఇద్దరు వ్యక్తులు ఇంటి బయట ఉండి సహకరించినట్లు సమాచారం. కాగా ఆ ముసలావ్వకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. అందులో ఒక కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. మరో కుమారుడు నగరంలోనే జీవిస్తున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: మైనర్‌ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *