Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్

బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఫోన్లు, ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది.

దేశ, విదేశాలకు వెళ్లే వందకుపైగా విమానాలకు ఇప్పటికే ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చింది.

ఇండిగో, ఎయిర్‌ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 85 విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో 25 ఆకాశా ఎయిర్‌ ఫ్లైట్స్‌కాగా, 20 ఎయిర్‌ ఇండియా, 20 ఇండిగో, 20 విస్తారా ఫ్లైట్స్‌ ఉన్నాయి. సోషల్‌ మీడియా ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫేక్ కాల్స్ తో విమానయయ సంస్థలకు వందలకోటలో నష్టం కలుగుతుంది. దీనిపై ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది6.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *