Lankeswarudu

Lankeswarudu: 35 ఏళ్ల ‘లంకేశ్వరుడు’!

Lankeswarudu: దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన నూరవ చిత్రం ‘లంకేశ్వరుడు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజయమాధవీ పిక్చర్స్ పతాకంపై వడ్డే రమేశ్ నిర్మించారు. 1989 అక్టోబర్ 27న విడుదలైన ‘లంకేశ్వరుడు’ చిత్రానికి రాజ్-కోటి సంగీతం ఎంతగానో అలరించింది. అన్నాచెల్లెళ్ళ అనుబంధంతో రూపొందిన ఈ చిత్ర కథ యన్టీఆర్ ‘రక్తసంబంధం’ను తలపిస్తుంది. ఇందులో అన్నాచెల్లెళ్ళుగా చిరంజీవి, రేవతి నటించగా, చెల్లెలు భర్త పాత్రలో నందమూరి కళ్యాణచక్రవర్తి అభినయించారు. రాధ నాయికగా రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు, సత్యనారాయణ, రఘువరన్, ఆనంద్ బాబు, ప్రత్యేక పాత్రలో నాగబాబు నటించారు. ఈ చిత్రంతోనే హిందీ నటుడు మహేశ్ ఆనంద్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు., ‘లంకేశ్వరుడు’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. అయితే ఇందులోని రాజ్ కోటి స్వరకల్పనలో రూపొందిన పాటలు భలేగా అలరించాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gaya: మాజీ సీఎం మనవరాలు హత్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *