Ind vs Eng

Ind vs Eng: చెన్నైలో నేడే రెండవ టీ20..! భారత్ స్పిన్ బలం ముందు ఇంగ్లాండ్ నిలిచేనా?

Ind vs Eng: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో రెండో మ్యాచ్ ఈరోజు చెన్నైలో జరగనుంది. మొదటి మ్యాచ్ లో అతి భారీ విజయం సాధించిన భారత జట్టు ఎంతో ఉత్సాహంగా రెండవ మ్యాచ్ కు ఎదురుచూస్తోంది. అటువైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని కసితో ఉంది. ఇక ఈ మ్యాచ్ తుది జట్ల వివరాలు మరియు పిచ్ విషయానికి వస్తే…

చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండవ మ్యాచ్ పైన క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ భీకర బ్యాటర్లు భారీ స్కోరు చేసి భారత జట్టుపై ఒత్తిడి పెడతారు అనుకుంటే వారు కాస్తా కుదేలయ్యారు. ఇక టీమిండియా తమ బ్యాటింగ్ బలంతో వారిని చిత్తు చేసింది. ఇంగ్లాండుకు ఎంతో అనుకూలించే ఈడెన్ పిచ్ పైనే భారత్ అలా చెలరేగి ఆడితే ఇప్పుడు చెన్నైలో పిచ్ మరింతగా స్పిన్ కు అనుకూలిస్తుంది.

ఇక పిచ్ రిపోర్టు విషయానికి వస్తే… ఎప్పటిలాగే చెన్నై పిచ్… స్పిన్నర్లకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఈ రోజు ఆడబోయే ట్రాక్ కూడా అలాగే ఉండబోతున్నట్లు రిపోర్టులో తెలుస్తోంది. ఇక జట్ల విషయానికి వస్తే… భారత్ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు స్పిన్నర్లు ఒకే ఒక్క స్పెషలిస్ట్ పేసర్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్లగా భారత్ మళ్లీ మ్యాచ్ ఆడవచ్చు లేదా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మహమ్మద్ షమీకి ప్రాక్టీస్ కోసం అవకాశం ఇవ్వదల్చుకుంటే స్పిన్నర్ రవి భీష్ణోయ్ ను పక్కన పెట్టవచ్చు.

ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే… పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో మరొక పేసర్ బైడెన్ కార్స్ జట్టులోనికి వస్తాడు. ఈ మధ్యకాలంలో మంచి ఫామ్ లో ఉన్న జాకబ్ బెతల్ శుక్రవారం ప్రాక్టీస్ కు రాలేదు. అతను కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు… మ్యాచ్ సమయానికి ఫిట్ గా ఉంటే టీం లోపల ఉంటాడు. లేనిపక్షంలో తన స్థానం స్థానంలో జైమీ స్మిత్ జట్టు లోనికి వస్తారు. ఈ రెండు మార్పులు మినహాయించి ఇంగ్లాండ్ జట్టులో కూడా మొదటి మ్యాచ్ లో ఉన్న సభ్యులు అందరూ ఉంటారు. అయితే మొదటి మ్యాచ్ కు ఒక రోజు ముందే తమ తుది జట్టున ప్రకటించిన ఇంగ్లాండ్… రెండవ మ్యాచ్ కు మాత్రం టాస్ కు ముందు జట్టును ప్రకటించాలని నిర్ణయించుకుంది.

మరొకసారి భారత స్పిన్నర్లు వర్సెస్ ఇంగ్లాండ్ బ్యాటర్ల మధ్యనే ముఖ్యమైన పోరు నెలకొనబోతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు వీలైనంత త్వరగా భారత స్పిన్నర్లను ఎలా సంయోచితంగా ఆడాలో… వారిని ఎప్పుడూ అటాక్ చేయాలో… ఎప్పుడు డిఫెన్స్ చేయాలో అన్న విషయంపై స్పష్టత రాకపోతే టీమిండియా రెండవ మ్యాచ్ లో కూడా సునాయాసమైన విజయం సాధిస్తుంది. మరి ఇంగ్లాండ్ బ్యాటర్లు వారి తప్పిదాల నుండి వెంటనే నేర్చుకొని పోటీ ఇస్తారా లేదా అన్న విషయం వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *